రాశీ ఖన్నా టాలెంట్ చూశారా…
తనలో దాగి ఉన్న టాలెంట్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. తనకి ఎంతో ఇష్టమైన పాటకి గిటార్ ప్లే చేస్తూ పాట పాడారు....
టాప్ హీరోయిన్గా టాలీవుడ్లో మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతున్న గ్లామర్ క్వీన్ రాశీ ఖన్నా. లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నారు. ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ… వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా తనలో దాగి ఉన్న టాలెంట్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. తనకి ఎంతో ఇష్టమైన పాటకి గిటార్ ప్లే చేస్తూ పాట పాడారు.
గిటార్ వాయిస్తూ రాశీ పాడిన పాటకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. త్వరలో మరోసాంగ్తో వస్తానంటూ పోస్ట్ చేశారు. ఇదంతా తన బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహం వల్లే జరిగిందని అన్నారు. అంతే కాదు తాను పాడిన “ఐ లవ్ యూ…” సాంగ్‌కు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు.
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నారు. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొట్టిన ఈ భామ ‘జై లవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించి మెప్పించారు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న రాశీ ఖన్నా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టారు. లాక్డౌన్ సమయంలో మాత్రం సోషల్‌మీడియాలో తెగ బిజీగా ఉంటున్నారు.