బ్రేకింగ్: పృథ్వీ షాపై బీసీసీఐ వేటు..!

యువ క్రికెటర్ పృథ్వి షాపై బీసీసీఐ వేటు విధించింది. డోపింగ్ టెస్ట్‌లో భాగంగా షా డ్రగ్ తీసుకున్నాడని నిర్ధారణ రావడంతో బోర్డు సస్పెన్షన్ విధించింది. ఇక షాకు సస్పెన్షన్‌ మార్చి 16 2019 నుంచి నవంబర్ 15 2019 వరకు వర్తిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహిస్తున్న సమయంలో షా యాంటీ డోపింగ్ టెస్ట్‌లో భాగంగా యూరిన్ శాంపిల్‌ను ఇవ్వగా.. అందులో ట్రబుతాలైన్ అనే డ్రగ్ ఉన్నట్లు నిర్ధారణ […]

బ్రేకింగ్: పృథ్వీ షాపై బీసీసీఐ వేటు..!
WADA Gives Clean Chit To Prithvi Shaw’s Doping Test Process
Follow us

|

Updated on: Jul 30, 2019 | 8:28 PM

యువ క్రికెటర్ పృథ్వి షాపై బీసీసీఐ వేటు విధించింది. డోపింగ్ టెస్ట్‌లో భాగంగా షా డ్రగ్ తీసుకున్నాడని నిర్ధారణ రావడంతో బోర్డు సస్పెన్షన్ విధించింది. ఇక షాకు సస్పెన్షన్‌ మార్చి 16 2019 నుంచి నవంబర్ 15 2019 వరకు వర్తిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహిస్తున్న సమయంలో షా యాంటీ డోపింగ్ టెస్ట్‌లో భాగంగా యూరిన్ శాంపిల్‌ను ఇవ్వగా.. అందులో ట్రబుతాలైన్ అనే డ్రగ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనితో యాంటీ డోపింగ్ రూల్ ఉల్లంఘన చట్టం ప్రకారం ఆర్టికల్ 2.1 క్రింద బీసీసీఐ సస్పెన్షన్‌ను విధించింది.

ఇక దీనిపై పృథ్వీ షా స్పందిస్తూ.. తనకు దగ్గుగా ఉన్న సమయంలో సిరప్ తాగానని చెప్పగా.. బీసీసీఐ దానిని పరిగణలోకి తీసుకుని బ్యాక్ డేటడ్ సస్పెన్షన్‌ను విధించింది. దీనితో పృథ్వీ షాకు  మార్చి 16 నుంచి 8 నెలల వేటును విధించింది.