సాహో హిందీ వెర్షన్.. అదే స్పెషల్!

బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్.. 300 కోట్ల రూపాయలతో నిర్మితమవుతన్న సాహోతో త్వరలో సందడి చేయనున్నాడు. సుజిత్ దర్శకత్వం బహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మరోవైపు ఈ మూవీ హిందీ వెర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయాయి. హిందీ వెర్షన్ లోను ప్రభాస్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా హిందీ భాషను నేర్చుకుని మరీ డబ్బింగ్ చెబుతున్నాడని టాక్ వినిపిస్తోంది. బాహుబలి హిందీ వెర్షన్ రిలీజ్ సమయంలో భాష విషయంలో కాస్త ఇబ్బంది పడిన ప్రభాస్, ఆ తరువాత నుంచే హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టేసి పట్టు సంపాదించాడని అంటున్నారు. ఇక సాహో హిందీ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఈ సారి ప్రభాస్ దడదడలాడించేయడం ఖాయమనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *