MLA Roja : ‘అచ్చెన్నాయుడు చెప్పినట్టు పార్టీ లేదు.. తొక్కా లేదన్నట్లే ఉంది టీడీపీ పరిస్థితి’ : ఎమ్మెల్యే రోజా ఎద్దేవా

జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు టీడీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు...

MLA Roja : అచ్చెన్నాయుడు చెప్పినట్టు పార్టీ లేదు.. తొక్కా లేదన్నట్లే ఉంది టీడీపీ పరిస్థితి :  ఎమ్మెల్యే రోజా ఎద్దేవా
MlLA Roja

Updated on: Jun 08, 2021 | 9:52 PM

Nagari MLA R K Roja : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు టీడీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పిన ఆమె, సీఎం వైయ‌స్ జగన్‌ పాలనను నీతి అయోగ్‌ ప్రశంసించిందని రోజా చెప్పుకొచ్చారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యం వ‌ద్ద రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా చెప్పినట్టు ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్నట్లే టీడీపీ ఉందని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అఖిలాంధ్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ, వచ్చే ప్రతికూలతలను అధిగమిస్తూ కుల, మత, రాజకీయాలకతీతంగా అందరికి అన్ని అందిస్తూ సాగుతున్న జనరంజక జగన్మోహన పాలన చూసి విపక్షాలకు దిమ్మతిరుగుతోందని రోజా అన్నారు.

Read also : Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. అక్కడ మాత్రం మామూలే..! కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..

Loading...
Unable to load recommendations.
Follow Us