దివంగత నేత వెయస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదిర షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు చక చక పావులు కదుపుతున్నారు. రెండు రోజుల క్రితం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. తన థర్డీ డేస్ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారు.
దీనికితోడు షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో షర్మిలతో సమావేశం కావడం ప్రాధాన్యత ఏర్పడింది. జగన్‌కు, షర్మిల పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వస్తున్న ప్రకటన నేపథ్యంలో ఇరువురి భేటీ చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం నాటి సమావేశం కోసం లోటస్ పాండ్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం వైఎస్, షర్మిల ఫొటోలే కనిపించాయి. అయితే నిన్న ఉన్నపళంగా ఫ్లెక్సీపై జగన్, విజయలక్ష్మిల ఫొటోలు ప్రత్యక్షమవ్వడంపై అనేక రకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
Read more:
జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి.. కొత్త కార్పోరేటర్లు ఏమని ప్రమాణం చేశారంటే..