నిమ్మగడ్డపై విజయసాయిరెడ్డి ఫైర్‌.. “నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు ఏడ్చినట్లు నటించు” అన్నట్లుంది మీ యవ్వారం అంటూ ట్వీట్‌

ఏపీ పంచాయతీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎస్‌ఈసీపై అధికార పార్టీ నేతల మాటల యుద్ధం ఆగడం లేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పాటు రాష్ట్ర‌ ఎన్నిక‌ల కమిషనర్..

నిమ్మగడ్డపై విజయసాయిరెడ్డి ఫైర్‌.. నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు  ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం అంటూ ట్వీట్‌

Edited By:

Updated on: Feb 06, 2021 | 3:38 PM

ఏపీ పంచాయతీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎస్‌ఈసీపై అధికార పార్టీ నేతల మాటల యుద్ధం ఆగడం లేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పాటు రాష్ట్ర‌ ఎన్నిక‌ల కమిషనర్‌ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తీరుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

టీడీపీ మేనిఫెస్టో ఎస్‌ఈసీ రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌ ఒకే దగ్గర తయారయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవర్నీ నమ్మడం లేదు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసే ఆయన బ్యాక్ ఆఫీసు! ‘ఈ వాచ్’ యాప్ తయారైంది అక్కడే. లేఖలు, ఆర్డర్ కాపీల డ్రాఫ్టింగ్ అక్కడే. తన తరపున వాదించే లాయర్ల ఏర్పాటు అంతా పచ్చ పార్టీదే. ఎంత స్వామి భక్తి ఉన్నా…ఇంత బరితెగింపా? అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక టీడీపీ విడుద‌ల చేసిన మేనిఫెస్టోను ఎస్ఈసీ ర‌ద్దు చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ‘భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ, టీడీపీ మేనిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!’ అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

 

Read more:

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. ఆ మంత్రిని ఈ నెల 21 వరకు హౌస్‌ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశం

Loading...
Unable to load recommendations.
Follow Us