మళ్లీ ఆ సీటును హస్తం చేజిక్కించుకోనుందా..?

పార్లమెంట్ ఎన్నికల అనంతరం.. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయిన నేతల నెక్ట్స్ టార్గెట్ ఖరారైంది. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా.. రాజీనామా చేయనుండటంతో.. ఆ స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో.. ఇప్పుడు అందరి కన్ను హుజూర్ నగర్‌పై పడింది. అయితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్‌లో మళ్లీ ఈసారి సీన్ రిపీట్ అవ్వనున్నట్లు.. కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ముందస్తు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:00 pm, Fri, 13 September 19
మళ్లీ ఆ సీటును హస్తం చేజిక్కించుకోనుందా..?

పార్లమెంట్ ఎన్నికల అనంతరం.. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయిన నేతల నెక్ట్స్ టార్గెట్ ఖరారైంది. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా.. రాజీనామా చేయనుండటంతో.. ఆ స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో.. ఇప్పుడు అందరి కన్ను హుజూర్ నగర్‌పై పడింది. అయితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్‌లో మళ్లీ ఈసారి సీన్ రిపీట్ అవ్వనున్నట్లు.. కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ముందస్తు ఎన్నికల్లో జరిగిన పోరులో.. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీఆర్ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదు రెడ్డిపై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Will Congress win this time in Huzurnagar by elections?

2009 నుంచీ.. హుజూర్‌ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉత్తమ్.. కష్టపడి గట్టెక్కగా.. ఇప్పుడు జరిగే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హుజూర్ నగర్ బై ఎలక్షన్ హోరా హోరీగా సాగనుంది. హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసేకోవాలని.. చూస్తోంది టీఆర్ఎస్. అదే విధంగా.. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఈ సారి హుజూర్ నగర్ స్థానం నుంచి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతీని బరిలోకి దింపుతారని ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే.. ఆమెకి అంత ఆసక్తి లేదని.. ఇప్పటికే.. పద్మవతి చెప్పారు. దీంతో.. మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా.. హుజూర్ నగర్ బై ఎలక్షన్స్‌ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. పద్మావతి కాకపోతే.. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి లేదా జానా రెడ్డి తనయుడు రఘువీరా రెడ్డిలను హుజూర్ నగర్ నుంచి పోటీ చేయించాలని టీ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

Will Congress win this time in Huzurnagar by elections?

అలాగే.. కాంగ్రెస్ నేతలు కూడా.. ఈ సారి ఖచ్చితంగా గెలవాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఎందుకంటే.. అధికారంలో టీఆర్ఎస్ వుంది కనుక.. ప్రశ్నించే వారుండాలని తహతహలాడుతోంది. మరోవైపు.. ప్రజలు కూడా కాస్త టీఆర్ఎస్‌పై విముఖతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు.. టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ శానంపూడి సైదిరెడ్డినే బై ఎలక్షన్స్‌లలో దింపాలని చూస్తోంది. ఈ విధంగా చూస్తే.. ఈ రెండు పార్టీ మధ్య టఫ్ ఫైట్‌నే జరిగేటట్టు కనిపిస్తోంది. ఇదిలా వుంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిజమాబాద్‌లో ఎంపీగా పోటీచేసి.. అనుకోని విధంగా ఘోర ఓటమిపాలైన కవితను.. ఈ బై ఎలక్షన్స్‌లో దింపాలని.. కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు.. టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొదట మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుంటారని అందరూ భావించినా.. కేసీఆర్.. అల్లుడి హరీశ్ రావుకి, కొడుకు కేటీఆర్‌కి మంత్రి పదవులు కట్టబెట్టారు.

Will Congress win this time in Huzurnagar by elections?

మొత్తం మీద కొన్ని నెలలుగా సాగుతున్న’ఎన్నికల సీజన్‌’కి హుజూర్ నగర్ బై ఎలక్షన్స్‌నే చివరిది కావడంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సక్సెస్ సాధించాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంత టఫ్ ఫైట్‌ల మధ్య ఏ పార్టీ వస్తుందని.. చెప్పడంలో.. రాజకీయ విశ్లేషకులు కూడా తర్జన భర్జనలు పడుతున్నారు.