Dhulipalla – MP Galla Jaydev – Drugs Case: డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. యావత్ దేశాన్నే డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాలిబన్స్ టు తాడేపల్లి అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో పొలిటికల్ డ్రగ్ వార్.. హైఓల్టేజ్‌కి చేరింది.
ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను విపక్షాలు టార్గెట్ చేయడంతో డ్రగ్స్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఊహించని విధంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆరోపణలు చేయడమే కాదు.. ఆధారాలు కావాలంటూ నోటీసులు ఇష్యూ చేయడం కలకలం రేపుతోంది.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులు అందజేశారు. కాకినాడ పోర్టులో తగలబడిన బోటులో డ్రగ్స్ ఉన్నాయన్న ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరారు.
ఏపీ ప్రభుత్వంపైనా, అధికార పార్టీ నేతలపైనా ధూళిపాళ్ల చేసిన ఆరోపణలకు పోలీసులు వివరణ కోరారు. మరి, ధూళిపాళ్ల ఆధారాలు ఇస్తారా? ఎలా రియాక్ట్ అవుతారు? ఆరోపణలు చేసిన టీడీపీ ఆధారాలతో సిద్ధంగా ఉందా? ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది.
బీజేపీ కూడా డ్రగ్స్ ఇష్యూపై తీవ్ర ఆరోపణలు చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా ఉండగా, డ్రగ్స్ దిగుమతి వెనుక కాకినాడ ఎమ్మెల్యే హస్తముందన్న టీడీపీ నేత పట్టాభి ఆరోపణలపై ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సీరియస్‌గా రియాక్టయ్యారు.