అందుకే రాజీనామా చేశా: సోమిరెడ్డి

సర్వేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న ఆయన మాట్లాడుతూ తాను అభివృద్ధిపై నమ్మకంతోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో ఎవరికీ లోటు రాకుండా జాగ్రత్తలు పడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవిలో కొనసాగిన […]

అందుకే రాజీనామా చేశా: సోమిరెడ్డి

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:22 PM

సర్వేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న ఆయన మాట్లాడుతూ తాను అభివృద్ధిపై నమ్మకంతోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో ఎవరికీ లోటు రాకుండా జాగ్రత్తలు పడుతున్నామని చెప్పారు.

ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవిలో కొనసాగిన సోమిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us