బీజెపీతో టీఆరెస్ నేతల టచ్ ? రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో ?

|

Sep 15, 2019 | 1:26 PM

తెలంగాణలో పాలక టీఆరెస్ నేతలు పలువురు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న వేళ.. టీఆరెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎవరెవరు, ఎప్పుడు ఏ బీజేపీ నేతను కలుస్తున్నారో క్లోజ్ గా గమనించి తమకు రిపోర్ట్ చేయాలని ఇంటెలిజన్స్ బ్యూరోను కోరినట్టు సమాచారం. తెరాసకు చెందిన కనీసం ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మాజీ మంత్రి ఒకరు, ఓ ఎమ్మెల్సీ కమలం పార్టీవారితో రహస్యంగా సమావేశమవుతున్నారని, వారి కదలికలపై నిఘా పెట్టి, నివేదిక సమర్పించాలని తెరాస […]

బీజెపీతో టీఆరెస్ నేతల టచ్ ? రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో ?
Follow us on

తెలంగాణలో పాలక టీఆరెస్ నేతలు పలువురు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న వేళ.. టీఆరెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎవరెవరు, ఎప్పుడు ఏ బీజేపీ నేతను కలుస్తున్నారో క్లోజ్ గా గమనించి తమకు రిపోర్ట్ చేయాలని ఇంటెలిజన్స్ బ్యూరోను కోరినట్టు సమాచారం. తెరాసకు చెందిన కనీసం ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మాజీ మంత్రి ఒకరు, ఓ ఎమ్మెల్సీ కమలం పార్టీవారితో రహస్యంగా సమావేశమవుతున్నారని, వారి కదలికలపై నిఘా పెట్టి, నివేదిక సమర్పించాలని తెరాస అధిష్టానం కోరిందట. బోధన్ ఎమ్మెల్ల్యే షకీల్ అమీర్ హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ తో భేటీ అయిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనతో ఆయన రహస్యంగా భేటీ కావడంపై అరవింద్ చేసిన ట్వీట్ ద్వారానే ఐబీలోని పొలిటికల్ వింగ్ తెలుసుకోవడంపట్ల టీఆరెస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అందువల్లే నిఘా మరింత పెంచాలని సూచించారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలోని ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు కూడా అలర్ట్ గా ఉండాలని కోరారట. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మాజీ నేత ఒకరు, ఓ ఎమ్మెల్సీ సహా 8 మంది తమ గన్ మెన్లను పంపివేసి, ‘పర్సనల్ పని ‘ మీద వెళ్తున్నామంటూ తామే ఇళ్ల నుంచి బయటకి వెళ్లారని మాజీ మంత్రి ఒకరు తెలిపారు. వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు వీరిలో ఉన్నారట. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ అరవింద్ తో తాను భేటీ కావడం సాధారణ విషయమేనని షకీల్ అంటున్నారు. పార్టీ మారితే ఆ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఏ విషయమూ దాచే ప్రసక్తి లేదన్నారు. అరవింద్ తండ్రి డీఎస్ కూడా తమ ఇంటికి వస్తుంటారని షకీల్ పేర్కొన్నారు.