Lok Sabha Elections 2024: రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు.

Lok Sabha Elections 2024: రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..
Lok Sabha Elections
Follow us

|

Updated on: Apr 26, 2024 | 8:56 PM

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

ఈ మొత్తం స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీఐ చెబుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్‌ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లో బన్స్‌వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. సాయంత్రం 5గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 77శాతం ఓటింగ్‌ జరిగింది. అస్సాంలో 70.66 శాతం, బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్‌ 72.13, జమ్మూకశ్మీర్‌ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్‌ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్‌ 76.06, రాజస్థాన్‌ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్‌ 52.74, పశ్చిమబెంగాల్‌ 71.84 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

మూడో దశ ఎన్నికలు 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి. దీని కోసం రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఆయా పార్టీల నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మోదీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే తరుణంలో రాహుల్, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారంలో వివిధ లోక్ సభ నియోజకవర్గాల్లో వేర్వేరుగా పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..