ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్ నామినేషన్ల ఉపసంహరణ..

| Edited By:

Mar 27, 2019 | 10:23 AM

నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గంలోని ఆర్మూర్ ప్రాంత రైతాంగం తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి మొత్తం 251 మంది రైతులు ఎంపీగా పోలీచేయడానికి నామినేషన్లు దాఖలు చేసి, గిట్టుబాటు ధరల కల్పనలో కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా పలు రకాల ఆందోళన కార్యక్రమాలతో మోడీ […]

ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్ నామినేషన్ల ఉపసంహరణ..
Follow us on

నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గంలోని ఆర్మూర్ ప్రాంత రైతాంగం తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి మొత్తం 251 మంది రైతులు ఎంపీగా పోలీచేయడానికి నామినేషన్లు దాఖలు చేసి, గిట్టుబాటు ధరల కల్పనలో కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

గత రెండు నెలలుగా పలు రకాల ఆందోళన కార్యక్రమాలతో మోడీ సర్కార్ తీరును ఎండగట్టిన ఆర్మూర్ ప్రాంత పసుపు, మొక్కజొన్న రైతులు.. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు మాస్ నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 200 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూటీ తర్వాత ఎన్నికల బరిలో 191 మంది మిగలగా.. వీరిలో ఏడుగురు రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా.. మిగిలిన వారు 184 మంది రైతులే కావడం విశేషం.

అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో ఉండడంతో పరిస్థితి మరింత ఆసక్తిగా మారింది. దీంతో.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. నామినేషన్లు దాఖలు చేసిన రైతులను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రేపటిలోగా తమ నామినేషన్లను రైతులు ఉపసంమరించుకునేలా బుజ్జగిస్తున్నట్లు సమాచారం.