ఉత్తమ్ కంటే ముందే ఆయనపై వేటు.. ఎందుకంటే?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ఊపు కనిపిస్తోంది. సోనియా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టారు. తెలంగాణలో నాయకత్వ మార్పుపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుని మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే ఇంకొకరిని మార్చాలని అధినేత్రి తలపెట్టారంట. ఇంతకీ వేటు పడే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? ఇదిప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేస్తారన్న ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ […]

ఉత్తమ్ కంటే ముందే ఆయనపై వేటు.. ఎందుకంటే?
Rajesh Sharma

|

Nov 27, 2019 | 2:17 PM

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ఊపు కనిపిస్తోంది. సోనియా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టారు. తెలంగాణలో నాయకత్వ మార్పుపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుని మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే ఇంకొకరిని మార్చాలని అధినేత్రి తలపెట్టారంట. ఇంతకీ వేటు పడే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? ఇదిప్పుడు హాట్ టాపిక్.

తెలంగాణలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేస్తారన్న ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి…పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి కంటే అధ్వాన్నమైన ప్రదర్శన చేయడం.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ భార్య పద్మావతి ఓడిపోవడం వంటి కారణాలతో నాయకత్వ మార్పుపై అధిష్టానం ఆలోచిస్తోంది. ఉత్తమ్‌ నల్గొండ ఎంపీగా గెలవడంతో ఆయన అవసరం ఢిల్లీలో ఎక్కువ. దీంతో ఆయన్ని తప్పించి…కొత్త నేతకు పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారట. ఎన్నికల్లో ఘోర ఫలితాలు, గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మార్పు విషయంలో నాయకత్వం స్పందించకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఉత్తమ్‌ను మార్చడానికంటే ముందే ఇంకొకరి మార్పు అనివార్యమని సోనియా భావిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. పీసీసీ చీఫ్‌తో పాటు రాష్ట్ర ఇంచార్జ్‌ కూడా సరిగ్గా వ్యవహరించలేదని అధిష్టానం దగ్గరకు రిపోర్టులు వెళ్లాయి. కుంతియా వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని ఢిల్లీకి వరుస ఫిర్యాదులు అందాయి. ఉత్తమ్‌ కంటే ముందే కుంతియాను మార్చాలని నేతలు పట్టుబడుతున్నారట. కొత్తగా వచ్చే ఇంచార్జ్‌ కొంత పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందనేది నేతల మాట. అలాంటి నేత వచ్చి ఏదైనా చెబితే పార్టీ క్యాడర్ వింటారు. దాంతో కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందనేది వీరి వాదన.

తెలంగాణ నేతల ఫిర్యాదుతో కుంతియాను మార్చాలని అధిష్టానం డిసైడ్ అయిందట. పీసీసీ చీఫ్‌ మార్పు కంటే ముందు కొత్త ఇంచార్జ్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో పలు రాష్ట్రాల ఇంచార్జ్‌లతో పాటు కుంతియాను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇంచార్జ్‌ ఎవరు? అనే దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. కొత్త ఇంచార్జ్‌గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లేదా కేంద్ర మాజీ మంత్రి స్థాయి వ్యక్తినే ఇంచార్జ్‌గా నియమిస్తారని తెలుస్తోంది. మొత్తానికి కుంతియా మార్పు మాత్రం ఖాయమని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu