RS seat for BJP: రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు

ఏపీలో రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు సీట్లకుగాను ఓ టిక్కెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆ సీటు కేటాయింపు వెనకాల వున్న సీక్రెట్.. అద్భుతమైన గేమ్ ప్లాన్‌పై ఇంటర్నల్ మ్యాటర్ వెలుగు చూస్తోంది.

RS seat for BJP: రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు
Follow us

|

Updated on: Mar 06, 2020 | 6:47 PM

New twist in Rajyasabha seat allocation: ఏపీలో రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు సీట్లకుగాను ఓ టిక్కెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆ సీటు కేటాయింపు వెనకాల వున్న సీక్రెట్.. అద్భుతమైన గేమ్ ప్లాన్‌పై ఇంటర్నల్ మ్యాటర్ వెలుగు చూస్తోంది. దానిపై విశ్లేషకుల అంఛనాలకు రీజనింగ్ లభిస్తోంది.

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు నలుగురు రిటైర్ అవుతుండడంతో ఆ నాలుగు సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 13వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. ఏకగ్రీవమైతే మార్చి 18న ప్రకటిస్తారు. అయితే.. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న వాటి నుంచి ఒక సీటును బీజేపీ అడిగినట్లు ప్రచారం జోరుగా జరిగింది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్ళి మరీ ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలిసి వచ్చారని అనుకున్నారంతా.

మూడు రాజధానుల అంశానికి, మండలి రద్దుకు కేంద్రం మద్దతునివ్వాలంటే తమకు ఓ రాజ్యసభ సీటు కేటాయించాలని బీజేపీ నేతలు కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జోరుగా కొనసాగుతుండగానే.. సడన్‌గా రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అమరావతికి వచ్చి మరీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇదేదో పెట్టుబడుల పెట్టేందుకో… కేజీ గ్యాస్ బేసిన్ గురించో అని కొందరన్నారు. కానీ అంబానీ వెంట రాజ్యసభ బెర్త్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న పరిమళ్ నత్వానీ కూడా ముఖేశ్ అంబానీ వెంట వచ్చారు. దాంతో మరో కోణం చర్చకొచ్చింది.

నత్వానీని గతంలో ఝార్ఖండ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. తొలిసారి పరిమళ్ నత్వానీ 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో ఝార్ఖండ్ నుంచి రెండోసారి రాజ్యసభ మెట్లెక్కారు. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి తిరిగి నామినేట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఏపీ నుంచి వైసీపీ కోటాలో రాజ్యసభకు పంపించేందుకే అంబానీ స్వయంగా వచ్చి జగన్‌ను కలిశారంటూ కథనాలు మొదలయ్యాయి. నత్వానీ అంటే ముఖేశ్ అంబానీకి విపరీతమైన గురి అని చెబుతూ వుంటారు. 64 ఏళ్ళ నత్వానీ తన యుక్త వయసులోనే ముఖేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి పనిచేయడంతో ముఖేశ్… నత్వానీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకుంటారు.

ట్విస్టు ఇదే..

నిజానికి అంబానీ తరపున రాయభారం జరిపింది అమిత్‌షా, మోదీలేనని తాజాగా అందుతున్న సమాచారం. ముందుగా వీరిద్దరు ఏపీ నుంచి వైసీపీ కోటాలో పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎన్నికయ్యేలా చూడాలని బీజేపీ అధినేతలు జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. వారి విఙ్ఞప్తిపై పార్టీ సీనియర్లతోను, తన రాజకీయ సలహాదారులతోను సంప్రదింపులు జరిపిన తర్వాత జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ముఖేశ్ అంబానీ స్వయంగా అమరావతికి తరలి వచ్చి.. ఫార్మల్‌గా వైసీపీ అధినేతను కలిశారని తెలుస్తోంది. బీజేపీ రాయభారం జరిపి.. కన్‌ఫర్మ్ చేసిన తర్వాతనే ఫార్మల్ మీటింగ్‌కోసం ముఖేశ్ వచ్చారని అంటున్నారు. లేకపోతే.. జాతీయ రాజకీయాలను శాసించే.. ముఖేశ్ అంబానీ చిన్ని రాజ్యసభ టిక్కెట్ కోసం స్వయంగా రంగంలోకి దిగరని, ముందుగా కేంద్రం పెద్దలతో రాయభారం జరిపి, కన్‌ఫర్మ్ చేయించుకున్న తర్వాతనే ఫార్మల్‌గా ఇన్‌వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందేనంటున్నారు పరిశీలకులు.

ఇదీ చదవండి: అధినేతలిద్దరికి అగ్నిపరీక్ష Litmus test for YCP, TRS chiefs

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో