జగన్ ఫ్యాన్ తిరగదు- నారా లోకేశ్‌

మంగళగిరి: రాష్ట్రానికి కియా పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోదీ  తీసుకొచ్చారన్న జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ కౌంటరిచ్చాడు . చంద్రబాబు కృషి ఫలితంగానే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైందని స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన  ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలుకావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కియా మోటార్స్‌ విషయంలో ప్రతిపక్ష నేత విమర్శలు దారుణమని […]

జగన్ ఫ్యాన్ తిరగదు- నారా లోకేశ్‌

Updated on: Mar 31, 2019 | 4:42 PM

మంగళగిరి: రాష్ట్రానికి కియా పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోదీ  తీసుకొచ్చారన్న జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ కౌంటరిచ్చాడు . చంద్రబాబు కృషి ఫలితంగానే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైందని స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన  ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలుకావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కియా మోటార్స్‌ విషయంలో ప్రతిపక్ష నేత విమర్శలు దారుణమని మండిపడ్డారు.  ఏనాడైనా మోదీ కియా ప్రతినిధులకు ఉత్తరం రాసి ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారా అని ప్రశ్నించారు.  ఆయన చేతిలో ఓ ఫ్యాన్‌ పట్టుకొని తిరుగుతున్నారని, కానీ ఆ ఫ్యాన్‌ తిరగదని ఎద్దేవా చేశారు. ఆ ఫ్యాన్‌ స్విచ్‌ ప్రధాని మోదీ వద్ద, రెగ్యులేటర్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ వద్ద ఉందని నారా లోకేశ్‌ విమర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us