ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ

|

Feb 06, 2021 | 3:39 PM

జాతీయ ఎస్సీ కమిషన్ కు టీడీపీ జతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. చీరాల దళిత యువకుడు కిరణ్..

ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ
Follow us on

జాతీయ ఎస్సీ కమిషన్ కు టీడీపీ జతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. చీరాల దళిత యువకుడు కిరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీసుల అతి ప్రవర్తన వల్ల 7నెలల క్రితం 26ఏళ్ల దళిత యువకుడు కిరణ్ మరణించాడని తెలిపారు.

మాస్క్ పెట్టుకోని కారణంగా పోలీసులు కొట్టడంతోనే ఆ యువకుడు చనిపోయాడని లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులు దీనిపై న్యాయపోరాటం చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఆర్థికసాయమూ అందించలేదని చెప్పారు.

ఇప్పటికే ఆలస్యమైనందున కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు. ఏపీలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా నిరంతరం బెదిరింపులకు గురవుతున్నారని అన్నారు. దళితులపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని దళితుల్లో ఆత్మ విశ్వాసం పెంచి, దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కి రాసిన లేఖలో ఎమ్మెల్సీ నారా లోకేష్‌ పేర్కొన్నారు.

 

Read more:

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. ఆ మంత్రిని ఈ నెల 21 వరకు హౌస్‌ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశం