మన్యం ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం.. ఆ స్థానాల్లో నామినేషన్‌కు ముందుకు రాని అభ్యర్థులు

|

Feb 11, 2021 | 7:04 PM

విశాఖ మన్యంలో పంచాయతీ ఎన్నికలపై మావోయిస్టుల ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో..

మన్యం ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం.. ఆ స్థానాల్లో నామినేషన్‌కు ముందుకు రాని అభ్యర్థులు
Follow us on

విశాఖ మన్యంలో పంచాయతీ ఎన్నికలపై మావోయిస్టుల ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో పలు చోట్ల నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. గిన్నెల కోటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మరికొన్ని చోట్ల పోలీసుల భయంతో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారింది.

గతంలో కూడా చాలా సార్లు పోలింగ్‌ కేంద్రాలు పేల్చేయడం, అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడంతో పాటు బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లగం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎన్నికలు వచ్చాయంటే అధికారులు అప్రమత్తమవుతూ ఉంటారు. ఇక మారుమూల గ్రామాల్లో ఎన్నికల విదులకు వెళ్లాలంటే పోలింగ్‌ సిబ్బంది అనాసక్తి చూపుతుంటారు.

తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ మన్యంలో అధికారులు మరోసారి శ్రమించాల్సి వస్తుంది. మావోయిస్టు నాయకురాలు అరుణ పేరుతో విడుదలైన లేఖలో అందరూ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీలో 244 పంచాయతీలకు, 2446 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.

విశాఖ మన్యంలోని 11 మండలాల్లో పెదబయలు, జేకే వీధి, జీమాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభ్యర్థులపై మావోయిస్టలు ప్రభావం కనిపించింది. భయంతో చాలా చోట్ల నామినేషన్లు వేసే ధైర్యం చేయలేదు.

 

Read more:

ఆయన హాయంలోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ.. అప్పుడు ఏమీ పట్టనట్టుగా ఉండి.. ఇప్పుడు రంకెలేస్తున్నాడెందుకో..