కర్ణాటకలోని(Karnataka) జేడీఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ కాలేజీ ప్రిన్సిపాల్ ను కొట్టారు. ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజం. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే చెంప దెబ్బకొడుతుంటారు. కానీ, తాను అడిగిన ప్రశ్నలకు సరైన ఆన్సర్ ఇవ్వలేదన్న కారణంతో కాలేజీ ప్రిన్సిపల్ ను కొట్టడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాండ్యలో(Mandya) జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కర్ణాటక మాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, జేడీఎస్ పార్టీకి చెందిన ఎం.శ్రీనివాస్.. ఓ ఐటీఐ కళాశాలను ఈనెల 20న సందర్శించారు. కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సమయంలో ప్రిన్సిపల్ నాగనాథ్ ను పలు ప్రశ్నలు అడిగారు.
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
ఇవి కూడా చదవండిThis happens when power goes to head
Shame? pic.twitter.com/8RTCCud8Mo
— Sheetal Chopra ?? (@SheetalPronamo) June 21, 2022
ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కోపం తెచ్చుకున్నాడు. విచక్షణ మరిచి, కళాశాల సిబ్బంది, ప్రజల ముందే ప్రిన్సిపాల్‌ను చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యేపైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.