టీఆర్ఎస్‌కు ఆ దమ్ముందా?: సాధినేని యామినీ

విజయవాడ: కేసీఆర్, కేటీఆర్‌కు ఏపీ ప్రజలంటే లెక్కలేదని, జగన్ తన ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏపీని, ఏపీ ప్రజలను అన్ని రకాలుగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని, ఏపీని టీఆర్ఎస్‌కు జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందంటున్న కేటీఆర్ తన తండ్రి రాజకీయ జీవితం ఎక్కడ మొదలైందనే విషయం గుర్తుపెట్టుకోవాలని యామిని అన్నారు. దమ్ముంటే కారు గుర్తుతో ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. […]

టీఆర్ఎస్‌కు ఆ దమ్ముందా?: సాధినేని యామినీ

Edited By:

Updated on: Mar 14, 2019 | 6:02 PM

విజయవాడ: కేసీఆర్, కేటీఆర్‌కు ఏపీ ప్రజలంటే లెక్కలేదని, జగన్ తన ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏపీని, ఏపీ ప్రజలను అన్ని రకాలుగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని, ఏపీని టీఆర్ఎస్‌కు జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందంటున్న కేటీఆర్ తన తండ్రి రాజకీయ జీవితం ఎక్కడ మొదలైందనే విషయం గుర్తుపెట్టుకోవాలని యామిని అన్నారు. దమ్ముంటే కారు గుర్తుతో ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అలా పోటీ చేయలేరని టీఆర్ఎస్ అంటేనే ఏపీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని యామిని అన్నారు.