బీజేపీ వైపు.. జేసీ చూపు..?

| Edited By: Pardhasaradhi Peri

Sep 16, 2019 | 7:40 PM

జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. ఉమ్మడి రాష్ట్రాంలో ఆయన కాంగ్రెస్‌ ఉన్న ఆయన.. విభజన తర్వాత టీడీపీ గూటికి చేరారు. 2014లో అనంతరపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడిని అనంతపురం పార్లమెంట్‌ నుంచి బరిలోకి దింపారు. అయితే వైసీపీ ఫ్యాన్‌ గాలికి ఆయన కుమారుడు నిలవలేకపోయారు. అయితే ఆ తర్వాత […]

బీజేపీ వైపు.. జేసీ చూపు..?
Follow us on

జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. ఉమ్మడి రాష్ట్రాంలో ఆయన కాంగ్రెస్‌ ఉన్న ఆయన.. విభజన తర్వాత టీడీపీ గూటికి చేరారు. 2014లో అనంతరపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడిని అనంతపురం పార్లమెంట్‌ నుంచి బరిలోకి దింపారు. అయితే వైసీపీ ఫ్యాన్‌ గాలికి ఆయన కుమారుడు నిలవలేకపోయారు. అయితే ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు పలు సార్లు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా కాస్లీ అయ్యాయని.. డబ్బుల ప్రవాహంతోనే రాజకీయాలు నడుస్తున్నాయంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కుమారుల భవిష్యత్తు కోసం ఆయన కమలం వైపు చూస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. బీజేపీ ఢిల్లీ పెద్దలు ఏపీలో కమలం పార్టీ పాగా వేయాలంటే బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిశ్చయించుకన్నారు. ఇదే సమయంలో జేసీ దివాకర్‌ రెడ్డిని వారు కలిసినట్లు వార్తలు వినిపించాయి. అయితే బీజేపీ పెద్దలు కలిసిన మాట వాస్తవేమనన్న ఆయన.. పార్టీ మారడం లేదని తెలిపారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే టీడీపీ రాజ్యసభ సభ్యులు ఒకేసారి నలుగురు కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నాయకులంతా ఒక్కొక్కరిగా కమలం గూటికి చేరుతుండటంతో.. జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు చూసిన తర్వాత ఆయన మోదీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబును వెనుకేసుకొచ్చిన ఆయన.. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులతో ఓడిపోయారని.. ప్రధాని మోదీ పథకాలే ఆయనను గెలిపించాయన్నారు. అంతేకాదు.. ఆ పథకాలను చూసే బీజేపీలోకి వలసలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని అన్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలంతా బీజేపీలోకి చేరడానికి మోదీషాల రాజకీయ చతురతనే అన్నారు. ప్రస్తుతం ఏపీలో కూడా వైసీపీకి ప్రత్యామ్మాయంగా.. తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా భారతీయ జనతా పార్టీవైపే చూస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు.

ఇక ఒకవేళ దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే.. ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనని జేసీ స్పష్టం చేశారు. ఓ వైపు టీడీపీ నేతగా ఉంటూ.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే.. జేసీ దివాకర్ రెడ్డి కమలం గూటికి చేరనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.