Video: వావ్.. వాట్ ఏ సీన్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో

Humble Gesture Dharmendra Pradhan Took Naveen Patnaik on Stage: జగన్నాథ రథయాత్ర కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఇంతలో, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వేదిక వద్దకు చేరుకుని, వేదికపైన ఉన్న వారికి నమస్కారం చెబుతున్నారు.

Video: వావ్.. వాట్ ఏ సీన్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో
Dharmendra Pradhan Took Naveen Patnaik On Stage

Edited By:

Updated on: Jul 08, 2024 | 10:01 PM

Humble Gesture Dharmendra Pradhan Took Naveen Patnaik on Stage: రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణంగా చూస్తేనే ఉంటాం. ఎన్నికలప్పుడే కాదు.. ప్రతీ సందర్భంలోనూ ఇలాంటివి కామన్ అయ్యాయి. అయితే, ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఓ వీడియో అందరి అంచనాలు తలక్రిందులు చేసేలా ఉంది. రాజకీయ విలువలు పాతాళాన్ని తాకుతున్న ఈ కాలంలో కొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ ప్రవర్తనతో అందరి హృదయాలను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇతర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒడిశాలోని పూరిలో కనిపించిన ఈ సీన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రవర్తనతో అందరి హృదయాలను హత్తుకున్నారు.

జగన్నాథ రథయాత్ర కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఇంతలో, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వేదిక వద్దకు చేరుకుని, వేదికపైన ఉన్న వారికి నమస్కారం చెబుతున్నారు. ఇది చూసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేదికపై నుంచి కిందకు వచ్చి నవీన్ పట్నాయక్‌ను తనతో పాటు వేదికపైకి తీసుకెళ్లారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో ఇక్కడ చూడండి..

రాజకీయాల్లో అధికారం మారడంతో, ప్రవర్తన కూడా మారుతుంది. కానీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం.. ప్రతిపక్ష నేత అని వదిలేయకుండా.. మాజీ ముఖ్యమంత్రి వద్దకు చేరుకుని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. వేదికపై తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టారు. ఇలాంటి అరుదైన సీన్లు.. రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ కూడా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం..

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ని గద్దె దించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 147 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా, బీజేడీ 51 సీట్లు గెలుచుకుంది. నవీన్ పట్నాయక్ తన సొంత సీటుపై ఓడిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి..