నిజామాబాద్‌ ఎలక్షన్‌పై ఈసీ తాజా స్పందన

|

Mar 26, 2019 | 9:59 PM

హైదరాబాద్: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 250కి పైగా నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించటం లేదనేది వారి ఫిర్యాదు. సమస్యకు నిరసనగానే నామినేషన్లు దాఖలు చేసిన్నట్టు రైతులు చెబుతున్నారు. అయితే ఇన్ని నామినేషన్లు దాఖలైతే ఎలక్షన్ ప్రక్రియ కఠినతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. పోటీలో 64 కంటే ఎక్కువ మంది […]

నిజామాబాద్‌ ఎలక్షన్‌పై ఈసీ తాజా స్పందన
Follow us on

హైదరాబాద్: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 250కి పైగా నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించటం లేదనేది వారి ఫిర్యాదు. సమస్యకు నిరసనగానే నామినేషన్లు దాఖలు చేసిన్నట్టు రైతులు చెబుతున్నారు. అయితే ఇన్ని నామినేషన్లు దాఖలైతే ఎలక్షన్ ప్రక్రియ కఠినతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.

పోటీలో 64 కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో కూడా అంతేనని తెలిపారు. ప్రస్తుతం దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్టరైన పార్టీలు, పోటీ చేసే వాటికే ఆ గుర్తులు కేటాయిస్తామని రజత్కుమార్ తెలిపారు.