ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక నామమాత్రమే కానుంది. ఎన్నికైన ఓ ప్రజా ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వేటు వేసింది. ఢిల్లీని తన చెప్పు చేతుల్లోకి ఉంచుకోవడానికి, తన నమ్మిన బంటు అయిన లెఫ్టినెంట్ గవర్నర్ కే సర్వాధికారాలను అప్పగించింది. ఇందుకు ఉద్దేశించిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2021 కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లును మొదట లోక్ సభ ఆమోదించగా ఆ తరువాత రాజ్యసభలో విపక్షాలు ఎంతగా అడ్డుకోజూసినప్పటికీ ఎగువ సభ కూడా దీన్ని ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇక ఢిల్లీ లో ప్రభుత్వం అంటే .. లెఫ్టినెంట్ గవర్నరే ! ప్రభుత్వం ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవలసిందే..ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిందంటూ కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. (మార్చి 22న లోక్ సభ, 24 న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి).
ఢిల్లీ బిల్లుపై విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, (కాంగ్రెస్), డెరెక్ ఓబ్రీన్, (తృణమూల్ కాంగ్రెస్), సంజయ్ సింగ్ (ఆప్) వంటివారంతా నాడు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యబధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను హరించడానికే ఉద్దేశించినదని ఈ పార్టీలు ఆరోపించాయి. అంతకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కే అన్ని అధికారాలనూ ఇస్తే ఇక తామంతా ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. అయితే రాజ్యసభలో ఈ బిల్లును సమర్థించిన బీజేపీ నేత, హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి.. ఇది ప్రస్తుతమున్న చట్టంలోని లొసుగులను సరిదిద్దడానికేనని, లెఫ్టినెంట్ గవర్నర్ కి అన్ని అధికారాలూ ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వ సలహాలను తీసుకుంటూ ఉంటారని చెప్పారు. కానీ విపక్షాలు దీన్ని అంగీకరించలేదు. అసలు ఈ బిల్లును తేవలసిన అవసరం ఏముందని, దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని అవి డిమాండ్ చేశాయి. ఏమైనా దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇది చట్టమైంది.
మరిన్ని ఇక్కడ చదవండి: Prime Minister Modi: అటు క్రికెట్‌లో, ఇటు టెన్నీస్‌లో అదరగొట్టారు.. ప్రధాని మోదీ చే ప్రశంసలు అందుకున్నారు..
JR. NTR should Work TDP: పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టీవ్ కావాలన్న టీడీపీ సీనియర్ నేత..