ఆ అమరవీరులకు గౌరవ సూచకంగానే నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నా, మమతా బెనర్జీ

2007 లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవ సూచకంగానే తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని, వారి మృతికి కారణమైన బెంగాల్ వ్యతిరేక శక్తులపై పోరాటమే తన లక్ష్యమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 2:04 pm, Sun, 14 March 21
ఆ అమరవీరులకు గౌరవ సూచకంగానే నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నా, మమతా బెనర్జీ
Mamata Banerjee

2007 లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవ సూచకంగానే తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని, వారి మృతికి కారణమైన బెంగాల్ వ్యతిరేక శక్తులపై పోరాటమే తన లక్ష్యమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 2007 లో తమ భూముల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ  నాటి ప్రభుత్వంపై పోరాడిన వారిపై పోలీసులు కాల్పులు జరపగా 14 మంది మరణించారు. అప్పటి నుంచి మార్చి  14 వతేదీని’ నందిగ్రామ్ దివస్’ గా పాటిస్తున్నారు. నాటి ఆ ఘటనను రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా మమత అభివర్ణించారు. 2007 లో ఇదే రోజున అమాయక గ్రామీణులు తమ ప్రాణాలను కోల్పోయారని, ఎన్నో  మృత దేహాలు కనబడకుండా పోయాయని  ఆమె అన్నారు. రైతులు ఈ రాష్ట్రానికి, దేశానికి సైతం గర్వకారణమని,  వీరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ప్రతి ఏడాదీ మార్చి  14 న కృషక్ దివస్ గా పాటిస్తున్నాం..కృషక్ రత్న అవార్డులు ఇస్తున్నాం.. రైతులు లేనిది ఈ సమాజమే లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలతో కలిసి పని చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

2007 లో సింగూరులో పారిశ్రామికీకరణ కోసం అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం రైతుల భూమిని బలవంతంగా సేకరించడానికి ప్రయత్నించిందని,  దీన్ని అడ్డుకున్న రైతులపై పోలీసుల చేత కాల్పులు జరిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.  ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 మంది అంటున్నా ఇంకా ఎక్కువమంది మరణించివుంటారని భావిస్తున్నారు. కాగా-   ఇటీవల నందిగ్రామ్ లో ‘దాడి’ కి గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాక మమతా బెనర్జీ  మొదటిసారిగా కోల్ కతా లో ఆదివారం జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. వీల్ చైర్ లోనే ఆమె సభా స్థలికి చేరుకున్నారు. మమత గాయపడిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు ఇప్పటికీఈసీని  కోరుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు అందిందే 48 గంటల్లో పరిష్కారం.. వాలంటీర్లకు కీలక బాధ్యతలు

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..