కాంగ్రెస్‌ వర్సెస్ టీఆర్‌ఎస్‌ ట్వీట్ వార్.. కేటీఆర్‌కు కౌంటర్లు, శశిథరూర్ పై రేవంత్ ఫోన్ సంభాషణ రచ్చ

ట్వీట్ వార్ ఆగడం లేదు. మాటల యుద్ధానికి ఎండ్‌ కార్డు పడటం లేదు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ వర్సెస్ టీఆర్‌ఎస్‌ ట్వీట్ వార్.. కేటీఆర్‌కు కౌంటర్లు, శశిథరూర్ పై రేవంత్ ఫోన్ సంభాషణ రచ్చ
Revanth

TS congress vs TRS: ట్వీట్ వార్ ఆగడం లేదు. మాటల యుద్ధానికి ఎండ్‌ కార్డు పడటం లేదు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల ఫోన్‌ సంభాషణ ఆడియోపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ రేవంత్‌ ఆడియోను రికార్డ్‌ చేసిన జర్నలిస్ట్‌ను సుపారీ జర్నలిస్ట్‌ అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. దీనిపై వెంటనే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పీసీసీ చీఫ్ పోస్టును విక్రయించే సుపారీ ఎఐసిసి ఇంఛార్జీల గురించి ఏంటి అంటూ కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేశారు.

మరో అడుగు ముందుకు వేసిన కేటీఆర్.. పీసీసీ పోస్ట్‌ను ఎఐసిసి ఇంచార్జి అమ్మకున్నాడని మీ సొంత పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పాడని న్యూస్‌ క్లిప్పింగ్‌ జతచేశారు. జర్నలిస్ట్‌లను సుపారీ జర్నలిస్ట్‌లంటూ వ్యాఖ్యానించే ముందు సిగ్గుపడండి అంటూ కేటీఆర్‌ చురకలంటించారు.

దీనిపై మాణిక్యం ఠాగూర్ మళ్లీ రిప్లై ఇచ్చారు. మా ఎంపీ కోపంతో అన్న మాటలు నిజమైతే.. అదే ఎం.పీ. కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన ఆరోపణలను అంగీకరిస్తారా అంటూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు మాణిక్యం. ఇలా ఇరు పార్టీల నేతల మధ్య ట్వీట్‌ వార్ కొనసాగుతోంది. ఓ వైపు ఇరుపార్టీల నేతల మధ్య మాటల తూటాలు, మరో వైపు ట్వీట్‌ వార్ కంటిన్యూ అవుతోంది.

మరోవైపు, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు టీఆర్‌ఎస్‌ నేతలు. 50 కోట్లతో పదవి కొనుక్కున్న రేవంత్‌ బటన్‌ మాత్రం చంద్రబాబు వద్దే ఉండిపోయిందంటూ ఘాటుగా విమర్శించారు. గజ్వేల్‌ సభకు 2 లక్షల మంది వచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. 8 ఎకరాల భూమిలో 2 లక్షల మందితో సభ ఎలా సాధ్యమని సూటిగా ప్రశ్నించారు.

Read also: Tv9-KAB Summit: టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu