తెలంగాణలో కాంగ్రెస్ ‘ధమాకా’ మొదలు

| Edited By:

Jun 05, 2019 | 9:49 AM

గురువారం విడుదలైన తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాగా కొన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులు. మొత్తం 538 జెడ్పిటీసీ స్థానాలకు గానూ 75 సీట్లు.. 5,816 ఎంపీటీసీ స్థానాలకు గానూ 1,377 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీ పుంజుకుంటోందని, ఈ […]

తెలంగాణలో కాంగ్రెస్ ‘ధమాకా’ మొదలు
Follow us on

గురువారం విడుదలైన తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాగా కొన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులు. మొత్తం 538 జెడ్పిటీసీ స్థానాలకు గానూ 75 సీట్లు.. 5,816 ఎంపీటీసీ స్థానాలకు గానూ 1,377 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీ పుంజుకుంటోందని, ఈ విషయాన్ని పరిషత్ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయలేదని.. కొన్ని చోట్ల కాంగ్రెస్ ట్టి పోటీ ఇచ్చిందని నారాయణ రెడ్డి తెలిపారు. పలుచోట్ల స్పష్టమైన మెజారిటీతో తమ పార్టీ గెలిచిందని.. కానీ కొన్ని చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిందని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఎలక్షన్‌ కోడ్‌ను ఉల్లంఘించిందని తెలిపిన ఆయన.. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ‘‘ఇటీవల వచ్చిన లోక్‌సభ ఫలితాల్లో మూడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఎంది. మరికొన్ని ప్రదేశాల్లో కూడా పుంజుకుంటోంది’’ అని నారాయణరెడ్డి అన్నారు. అయితే ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తరువాత డీలా పడుతూ వస్తోంది. ఇక గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.