కొత్త పంచాయితీరాజ్ చట్టంపై పాఠాలు చెప్పనున్న కేసీఆర్

కొత్త పంచాయితీరాజ్ చట్టంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన, శిక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో చట్టం రూపురేఖలు, ప్రభుత్వ లక్ష్యాలను వివరించేందుకు రాష్ట్రంలో నాలుగుచోట్ల సమ్మేళనాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 8వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ స్వరాజ్యం, అవినీతిరహిత పాలన, అధికారులు, ప్రజాప్రతినిధుల సరికొత్త బాధ్యతలతో కొత్త పంచాయితీరాజ్ చట్టం రూపొందింది. అయితే ఇటీవలే పరిషత్ ఎన్నికలు […]

కొత్త పంచాయితీరాజ్ చట్టంపై పాఠాలు చెప్పనున్న కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2019 | 9:45 AM

కొత్త పంచాయితీరాజ్ చట్టంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన, శిక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో చట్టం రూపురేఖలు, ప్రభుత్వ లక్ష్యాలను వివరించేందుకు రాష్ట్రంలో నాలుగుచోట్ల సమ్మేళనాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 8వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ స్వరాజ్యం, అవినీతిరహిత పాలన, అధికారులు, ప్రజాప్రతినిధుల సరికొత్త బాధ్యతలతో కొత్త పంచాయితీరాజ్ చట్టం రూపొందింది.

అయితే ఇటీవలే పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్‌పర్సన్లు, సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కొత్త పంచాయితీరాజ్ చట్టంపై రాష్ట్ర పంచాయితీ రాజ్ శిక్షణ సంస్థ పుస్తకాలను ముద్రిస్తోంది. పంచాయితీ కార్యదర్శుల కోసం ప్రత్యేకంగా మరో మూడు కరదీపికలను తయారుచేస్తోంది. పురపాలక సంఘాల ఎన్నికల తర్వాతే శిక్షణ కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. ఇక ఈ సమ్మేళనాలను వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మేడ్చల్ కేంద్రాల్లో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.

Latest Articles
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి