వ్వవసాయ చట్టాలపై ప్రధాని మోడీ మొండిగా వ్యవహరించడం తగదని, రైతుల పక్షాన ఆలోచించాలని కోరారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం రైతులను ఏడ్పించడం మానుకోవాలని, వ్యవసాయ చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఈనెల 29న రైతులతో జరుగనున్న చర్చలు ఫలప్రదం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.
కనీస మద్దతు ధర విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పప్పు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆయిల్‌పామ్ ఉత్పత్తులపై ప్రోత్సాహకాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల తక్షణమే నష్టం ఏర్పడుతుందని, అందుకే అక్కడి రైతులు ఆందోళనల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని చెప్పారు. విద్యుత్ చట్టసవరణ బిల్లు వల్ల తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్పడిందని చెప్పారు.