
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ బీజేపీకి షాక్ ఇచ్చారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సిట్టింగ్ స్థానాన్ని పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్‌కు బీజేపీ ఇవ్వడంతో.. ఆయన పార్టీ మారారు. ప్రతిభ కనబర్చిన ఎంపీల్లో తాను రెండో స్థానంలో ఉన్నానని.. అయినా తనకు టికెట్ కేటాయించలేదని విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చౌకీదార్ పేరును కూడా ఉదిత్ రాజ్ రాజ్ తొలగించారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్.. 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.