కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు.. కమలనాథులు తడాఖా చూపుతారా..?

| Edited By:

Apr 25, 2019 | 12:06 PM

సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తోంది బీజేపీ. మొత్తం 545 లోక్‌సభ స్థానాలకు గానూ 437 స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. 1980లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఇన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. దీన్ని చూస్తుంటే దేశ రాజకీయాలలో బీజేపీ తన స్థాయిని పెంచుకుంటోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా 2009 ఎన్నికల్లో బీజేపీ 433 సీట్లలో, కాంగ్రెస్ 440 స్థానాల్లో పోటీ చేశాయి. […]

కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు.. కమలనాథులు తడాఖా చూపుతారా..?
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తోంది బీజేపీ. మొత్తం 545 లోక్‌సభ స్థానాలకు గానూ 437 స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. 1980లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఇన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. దీన్ని చూస్తుంటే దేశ రాజకీయాలలో బీజేపీ తన స్థాయిని పెంచుకుంటోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా 2009 ఎన్నికల్లో బీజేపీ 433 సీట్లలో, కాంగ్రెస్ 440 స్థానాల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో 206సీట్లలో గెలిచిన కాంగ్రెస్, యూపీఏలోని పార్టీల పొత్తుతో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2014 ఎన్నికల్లో బీజేపీ 428, కాంగ్రెస్ 464సీట్లలో పోటీ చేయగా.. 282  సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 423 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరికొందరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.