Municipal Elections 2021: కర్నూలులో సాఫీగా పోలింగ్‌.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్‌

|

Mar 10, 2021 | 8:43 AM

కర్నూలు జిల్లాలో సాఫీగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సాగుతోంది. ఎస్.ఈ.సి. నిబంధనల మేరకు ఈ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు..

Municipal Elections 2021: కర్నూలులో సాఫీగా పోలింగ్‌.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్‌
Follow us on

AP Municipal Elections: కర్నూలు జిల్లాలో సాఫీగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సాగుతోంది. ఎస్.ఈ.సి. నిబంధనల మేరకు ఈ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ..ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు.

ఈ ఉదయం 6:30 గంటల నుండి కలెక్టరేట్ లో మునిసిపల్ ఎన్నికల కంట్రోల్/వార్ రూం నుండి పోలింగ్ ప్రారంభమైన తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా, పోలీసు వైర్లెస్ సెట్స్ , టీవీల ద్వారా పరిశీలన చేస్తూ..జిల్లా నోడల్ అధికారులతో సమీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, డి. ఆర్.ఓ పుల్లయ్య

కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ లో ఈ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం అయింది.

కర్నూలు జిల్లాలో పోలింగ్ జరుగుతున్న మునిసిపాలిటీ లు – 9; మొత్తం వార్డులు-302; ఏకగ్రీవం అయినవి-77; పోలింగ్ జరుగుతున్న వార్డులు-225; మొత్తం ఓటర్లు- 8, 58,610 ; మొత్తం పోటీలో ఉన్న అభ్యర్థులు-881; మొత్తం పోలింగ్ కేంద్రాలు-781; మొత్తం హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు-281; సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు-234; మొత్తం పోలింగ్ అధికారులు, సిబ్బంది- దాదాపు 7,500 ల మంది; మొత్తం పోలీసు బందోబస్తు – 2018 మంది పోలీసు అధికారులు, సిబ్బంది; పోలింగ్ కేంద్రాల్లో విడియోగ్రఫీ, వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ల నియామకం

ఎన్నికల ఫిర్యాదుల కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్- 1800-4255180

మునిసిపాలిటీలలో పోలింగ్ సాఫీగా జరగడం కోసం సమన్వయ అధికారులుగా 9 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను నియమించామని కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.

Read More:

Municipal Elections 2021: విశాఖలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం.. ఉక్కు కార్మికుల నిరసనల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు

Municipal Elections 2021: విజయవాడలో ప్రారంభమైన పోలింగ్‌.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న 7.83 లక్షల మంది ఓటర్లు