శ్రీవారి బంగారంతో రాజకీయాలా..? : మంత్రి దేవినేని

శ్రీవారి బంగారంతో వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. శ్రీవారి బంగారంపై వైసీపీ ఇలా రాద్ధాంతం చేయడం సరైన పద్దతి కాదన్నారు. బంగారంపై ప్రత్యేకంగా విజయ సాయి మీడియా పాయింట్‌ పెట్టి ఇంత రాద్ధాంతం చేసే అవసరం లేదని.. స్వామి వారి బంగారం బ్యాంకులలో భద్రంగా ఉందని.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ లెక్కల రూపంలో చెప్పారని ఆయన అన్నారు. […]

శ్రీవారి బంగారంతో రాజకీయాలా..?  : మంత్రి దేవినేని

Edited By:

Updated on: Apr 25, 2019 | 12:01 PM

శ్రీవారి బంగారంతో వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. శ్రీవారి బంగారంపై వైసీపీ ఇలా రాద్ధాంతం చేయడం సరైన పద్దతి కాదన్నారు. బంగారంపై ప్రత్యేకంగా విజయ సాయి మీడియా పాయింట్‌ పెట్టి ఇంత రాద్ధాంతం చేసే అవసరం లేదని.. స్వామి వారి బంగారం బ్యాంకులలో భద్రంగా ఉందని.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ లెక్కల రూపంలో చెప్పారని ఆయన అన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు ఇప్పటికీ నిధులివ్వకుండా కేంద్రం మోసం చేసిందని.. అయినా టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు చేపట్టిందన్నారు. ఆర్థిక నేరగాళ్లు విజయసాయి, జగన్‌లకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు దేవినేని.