Pushpa Munjial: దేశానికి ఆయన నాయకత్వం అవసరం.. రాహుల్‌ పేరు మీద బంగారాన్ని రాసిచ్చిన పుష్ప….

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీకి 50 లక్షల విలువైన ఆస్తిని , బంగారాన్ని రాసిచ్చారు ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళా అభిమాని. దేశానికి రాహుల్‌ నాయకత్వం అవసరమంటున్నారు 78 ఏళ్ల పుష్పా..

Pushpa Munjial: దేశానికి ఆయన నాయకత్వం అవసరం.. రాహుల్‌ పేరు మీద బంగారాన్ని రాసిచ్చిన పుష్ప....
Transfers All Her Property

Updated on: Apr 04, 2022 | 9:31 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీకి 50 లక్షల విలువైన ఆస్తిని , బంగారాన్ని రాసిచ్చారు ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళా అభిమాని. దేశానికి రాహుల్‌ నాయకత్వం అవసరమంటున్నారు 78 ఏళ్ల పుష్పా ముంజియాల్‌(Pushpa Munjial). ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అయినప్పటికి అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యంగా రాహుల్‌గాంధీకి వీరాభిమానులు ఉన్నారు. తన ఆస్తినంతా రాహుల్‌గాంధీ పేరు మీద రాసేశారు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వృద్దురాలు. బంగారం కూడా రాహుల్‌గాంధీ పేరు మీద రాశారు. రాహుల్‌గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు 78 ఏళ్ల పుష్పా ముంజియాల్‌. రాహుల్‌గాంధీకి 50 లక్షల ఆస్తిని రాసిచ్చారు పుష్పా ముంజియాల్‌ . 10 తులాల బంగారాన్ని కూడా పీసీసీ నేతలకు అందచేశారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎంతో త్యాగం చేసిందని , అందుకే పుష్పా ముంజియాల్‌ తన ఆస్తిని రాహుల్‌గాంధీ పేరు మీద రాశారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయాలంటున్నారు పుష్పా ముంజియాల్‌. అప్పుడే పార్టీకి పునర్‌ వైభవం వస్తుందని తెలిపారు. దశాబ్ధాల నుంచి పుష్ప కాంగ్రెస్‌ పార్టీ అభిమానిగా ఉన్నారు. రాహుల్‌ ప్రసంగాలు దేశ ప్రజలను ఆలోచింప చేసే విధంగా ఉంటాయని పుష్ప ప్రశంసించారు