అవినీతి ఖాకీ, లంచాలే డ్యూటీ !

 ఆ పోలీస్‌స్టేషనే ఆయన అక్రమ డబ్బు సంపాదనకు మార్గం. ఎటువంటి సమస్యలతో అక్కడికి వెళ్లినా బాధితులు లంచం ఇవ్వకుండా తిరిగి రావడానికి వీలు పడదు.

అవినీతి ఖాకీ, లంచాలే డ్యూటీ !
Follow us

|

Updated on: Sep 16, 2020 | 1:33 PM

ఆ పోలీస్‌స్టేషనే ఆయన అక్రమ డబ్బు సంపాదనకు మార్గం. ఎటువంటి సమస్యలతో అక్కడికి వెళ్లినా బాధితులు లంచం ఇవ్వకుండా తిరిగి రావడానికి వీలు పడదు. కేసును బట్టి లంచం రేటుంటుంది. పంచాయితీ చేస్తే మరో రేటు.  ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ స్టేషన్ రూల్స్ మొత్తం మారిపోయాయి. సదరు అధికారి మకాం వేసిన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సబ్‌ డివిజన్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే బాధితులు జంకుతున్నారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌లో విధుల్లో జాయిన్ అయి సుమారు 10 నెలలు గడిచింది. అప్పటి నుంచి ఆయన సంపాదన లెక్క దీస్తే ఎన్ని లక్షలో చెప్పడమే కష్టం అంటున్నారు. పంట కోత సీజన్‌లో హార్వెస్టర్ల ఓనర్స్ నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన ఆ ఇన్‌స్పెక్టర్‌ రూటే సెపరేట్ అంటూ సొంత శాఖలోనే చర్చ సాగుతోంది. మామూళ్లకు అలవాటుపడ్డ ఆ ఇన్‌స్పెక్టర్‌ను ఎవరైనా ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే.. ‘రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని పోస్టింగ్‌ దక్కించుకున్నాం… అదంతా తిరిగి వసూలు చేసుకోకపోతే ఎలా’ అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారట. అవినీతికి అడ్రస్ గా నిలిచిన ఆయన వైఖరిపై వరుస కంప్లైంటులు అందడంతో ఇంటలెజెన్స్ అధికారుల ఫోకస్ పెట్టారు. ఓ కీలక ప్రజాప్రతినిధి అండ ఉందని డాబులు చెప్పుకుంటూ ఆయన ఈ తతంగం కానిచ్చేస్తున్నారట. మరి లంచాల అధికారి తిక్క ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

Also Read :

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో