‘ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి’ స్కాంలో కొనసాగుతున్న విచారణ.. 30కోట్లు రికవరీ

తమిళనాడును ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం కుదిపేస్తోంది. రాష్ట్రంలో నకిలీ పత్రాలతో రైతుల ముసుగులో దళారులు సుమారు

'ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి' స్కాంలో కొనసాగుతున్న విచారణ.. 30కోట్లు రికవరీ
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 5:19 PM

Kisan Samman scam: తమిళనాడును ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం కుదిపేస్తోంది. రాష్ట్రంలో నకిలీ పత్రాలతో రైతుల ముసుగులో దళారులు సుమారు రూ.120కోట్లను దోపిడీ చేశారు. ప్రతి జిల్లాలో 20 నుంచి 40వేల మంది రైతులకు చెందాల్సిన కిసాన్ సమ్మాన్ నిధిని కోట్లతో దోపిడీ చేశారు. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. ఇక ఈ స్కాంపై కలెక్టర్ల ఆదేశాలతో విచారణ వేగవంతం చేసిన సీబీసీఐడీ అధికారులు దళారుల నుండి 30 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేశారు. నెట్‌ సెంటర్లు, ఆధార్ మార్పుల పేరుతో పేద రైతులకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించిన దళారులు దరఖాస్తు చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు.

కిసాన్ సమ్మాన్ నిధి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వర్లను హ్యాక్‌ చేసి ఇంత పెద్ద మొత్తంలో నగదు దోపిడీ చేసినట్టు సీబీసీఐడీ అధికారులు వెల్లడించారు. నకిలీ ఖాతాదారులను గుర్తించి ఇప్పటివరకు వారి దగ్గర నుండి 30 కోట్లవరకు రికవరీ చేశామని.. మరో రెండు , మూడు నెలల్లో పూర్తి మొత్తంలో రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ స్కామ్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాధికారుల సహకారం లేనిదే ఇంత పెద్ద స్కాం జరిగే అవకాశం లేదని ,దళారులకు సహకరించిన ప్రభుత్వ అధికారులను శిక్షించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read More:

‘నగదు బదిలీ పథకం’పై అజయ్‌ కల్లాం క్లారిటీ.. ఏపీ రైతులకు భరోసా

90 ఏళ్ల వృద్ధురాలిపై 37 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్‌