పింక్ టెస్ట్: భారత్ విజయం లాంఛనమే..!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం లాంఛనమే. భీకరమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ముందు బంగ్లాదేశ్ మరోసారి మోకరిల్లిందని చెప్పాలి. 241 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫికర్‌ రహీమ్ (59 బ్యాటింగ్‌; 70 బంతుల్లో 10×4) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మొదటి […]

పింక్ టెస్ట్: భారత్ విజయం లాంఛనమే..!
Follow us

|

Updated on: Nov 24, 2019 | 3:37 AM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం లాంఛనమే. భీకరమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ముందు బంగ్లాదేశ్ మరోసారి మోకరిల్లిందని చెప్పాలి. 241 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫికర్‌ రహీమ్ (59 బ్యాటింగ్‌; 70 బంతుల్లో 10×4) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి.. బంగ్లా పట్నంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరో 89 పరుగులు చేయాల్సి ఉంది. అద్భుతం జరిగితే తప్ప.. బంగ్లాను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 347 పరుగులు వద్ద డిక్లర్ చేసింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (136; 194 బంతుల్లో 18×4) అద్భుత సెంచరీ సాధించి రికార్డులను తిరగరాశాడు.