
ఆదివారం ఎప్పుడూ బయట తిరగడం, డబ్బులు ఖర్చు పెడుతూ స్నేహితులతో ఎంజాయ్ చేయడం కాకుండా, ఈ ఒక్క రోజు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడపండి. ఇంటిలోనే లేదా మీకు దగ్గరగా ఉన్న ఏదైనా మంచి ప్రదేశంలోకి వెళ్లి ఒకరికి ఒకరు సమయం కేటాయించుకొని, మనసు విప్పి మాట్లాడుకోండి. దీని వలన మీ డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. అలాగే మీ బంధం మంరింత బలపడుతుంది.

అంతే కాకుండా కాస్త సమయం దొరికితే చాలు చాలా మంది ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం లేదా , రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. కానీ ఈ ఆదివారం అలా కాకుండా, కాస్త సమయం కేటాయించి. మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అలాగే, చాలా రోజుల నుంచి మనసులో ఏవైనా చెప్పుకోవాల్సిన విషయాలు ఉంటే, ఒకరికి ఒకరు వాటిని పంచుకొని ఆనందంగా ఉండండి. ఈ చిన్న పనులు చేయడానికి మీరు ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.

సరదా సవాళ్లు విసరండి, ఇట్లోనే చిన్న చిన్న సవాళ్లతో ఆనందంగా గడపచ్చు. ముఖ్యంగా అడగకుండానే ఒకరికి ఒకరు ఇష్టమైన వస్తువుల పేర్లు చెప్పడం. ప్రేమ తాలుకూ విషయాలను గురించి మాట్లాడుకోవడం. చిన్న చిన్న సరదాలను రీ క్రియేట్ చేయడం వలన ఆ సండే మీకు చాలా ఆనందంగా సంతోషంగా గడిచిపోతుంది. చాలా ఆనందంగా సండే మీరు ఎంజాయ్ చేయవచ్చును.

అంతే కాకుండా ఈ సండే మీరు మీ భాగస్వామికి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయండి. తనను మీకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పండి. ఇలా మీకు నచ్చిన వంటకాలను మీ చేతులతోనే ప్రిపేర్ చేసుకొని ఆనందంగా తినడమే కాకుండా చాలా సంతోషంగా గడపవచ్చు. మీ రెస్టారెంట్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి తిన్నా ఇలా మీరు ఇంటిలో వండుకొని తిన్న సంతృప్తి ఉండదు. అంతే కాకుండా మీ మనీ కూడా సేవ్ అవుతాయి.

అలాగే ఇంటిలో గేమ్స్ ఆడటం, క్యారం బోర్డ్, లుడో, షటిల్ వంటి మీకు నచ్చిన గేమ్స్ ఆడుకోండి. అందులో కూడా సవాళ్లు విసురుకోండి. ఇలా చేయడం వలన మీరు చాలా సరదాగా ఈ సండేను ఎంజాయ్ చేస్తుంటారు. అంతే కాకుండా మీ డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. ఇది మీకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది.