
మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. కాలేయం ఆరోగ్యంగా ఉంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయంలో ఏవైనా సమస్యలు ఉంటే క్రమంలో ఆరోగ్యంపై రోగాలు దాడి చేస్తాయి. అయితే కాలేయం దెబ్బతిన్నట్లు ముందస్తు సంకేతాలు ఏమీ కనిపించవు.

అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయం విష పదార్థాలను తొలగించడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాలేయం దెబ్బతిన్నట్లయితే, తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.

సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలేయ సమస్యల లక్షణాలు సాధారణంగా వెంటనే స్పష్టంగా కనిపించవు. లక్షణాలు కనిపించడానికి చాలా సమయం పడుతుంది. అయితే మన ఒంట్లో ఓ అవయవం దీని ఆరోగ్యం గురించి ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది.

కాలేయం ఎక్కువగా క్షీణించడం ప్రారంభిస్తే దాని లక్షణాలు మన కళ్ళలో కనిపిస్తాయి. దీని వల్ల కళ్ళు నేరుగా ప్రభావితమవుతాయి. కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. దీనిని మనం కామెర్లు అని పిలుస్తాం.

కామెర్లు కాలేయం దెబ్బతింటుందని సూచించే ప్రధాన సంకేతం. అత్యంత సాధారణ లక్షణం కళ్ళు పసుపు రంగులోకి మారడం. దీనిని కామెర్లు అంటారు. అందువల్ల కళ్ళు పసుపు రంగులోకి మారితే దానిని తేలికగా తీసుకోకూడదు. శరీరంలో బిలిరుబిన్ అనే పసుపు వర్ణద్రవ్యం అధికంగా పేరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. దీని వల్ల కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఈ లక్షణం కనిపిస్తే అస్సలు విస్మరించవద్దు.