Rajitha Chanti |
Jul 22, 2021 | 12:52 PM
హిందూ మహాసముద్రం భూమిలో 20 శాతం విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక నీరు ఇక్కడే ఉంటుంది. హిందూ మహాసముద్రం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సగటు లోతు 3890 మీటర్లు.
హిందూ మహాసముద్రం ఉత్తరాన భారత ఉపఖండం ఉంది. దీనికి పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున సునాడ ద్వీపం, ఆస్ట్రేలియా, దక్షిణాన అంటార్కిటికా ఉన్నాయి. దీని వైవిధ్యాన్ని 57 వేర్వేరు ద్వీపాలు, 16 ఆఫ్రికన్, 18 ఆసియా దేశాలలో చూడవచ్చు. దిశల తెలపడానికి చాలా చిన్న ఓడరేవులు ఈ మహాసముద్రంతో అనుసంధానించబడి ఉన్నాయి.
ఈ మహాసముద్రంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ సముద్ర జంతువులు తక్కువగా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ మహాసముద్రం. ఇక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వలన ఎక్కువగా జీవరాశులు బ్రతకవు.
హిందూ మహాసముద్రం ప్రపంచంలో ఆక్సిజన్ స్థాయి అత్యల్పంగా ఉన్న సముద్రం. నీటి బాష్పీభవనం ఇక్కడ చాలా వేగంగా జరుగుతుంది. అందుకే మిగతా వాటితో పోలిస్తే ఈ మహా సముద్రం చాలా ప్రత్యేకమైనది.
ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఓడరేవులు ఈ మహాసముద్రం సరిహద్దులోనే ఉన్నాయి. భారతదేశపు చెన్నై, ముంబై, కోల్‌కతా, శ్రీలంక, కొలంబో, దక్షిణాఫ్రికా డర్బన్, రిచర్డ్స్ బే, ఇండోనేషియాకు చెందిన జకార్తా, ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఈ హిందూ మహాసముద్ర సరిహద్దులో ఉన్నాయి.
హిందూ మహాసముద్రం ప్రపంచ వాణిజ్యానికి ఎంతో దోహదపడుతుంది. నావిగేషన్ మార్గాలు, పెద్ద మొత్తంలో ఖనిజాలతో పాటు, హిందూ మహాసముద్రం ప్రపంచ చమురు నిక్షేప జనాభాలో 40 శాతం కూడా ఉంది.
ఈ సముద్రంలో కెర్గులెన్ పీఠభూమిని కొంతకాలం క్రితం కనుగొన్నారు. సముద్రంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద ప్రావిన్స్ ఇదే. ఇది హిందూ మహాసముద్రానికి దక్షిణాన ఉంది. అంటార్కిటిక్ ప్లేట్‌లో ఉంది. దీని పరిమాణం కాలిఫోర్నియా కంటే మూడు రెట్లు ఎక్కువ అని చెబుతారు.