1 / 5
కరోనా కల్లోలంతో నిత్యం రద్దీగా ఉండే థాయ్ వీధులు ఖాళీ అయిపోయాయి. పర్యాటకులు లేరు.. స్థానికులు బయటకు వెళ్లాలంటే భయం దీంతో ట్యాక్సీ డ్రైవర్‌లకు పని లేకుండా పోయింది. చాలామంది డ్రైవర్లు సొంత ఊర్లకు చేరుకున్నారు, దీంతో టాక్సీలను వాడకుండా దాదాపు ఏడాదిన్నర నుంచి వదిలేశారు. ఇప్పుడు ఆ ట్యాక్సీల పై మొక్కల పెంపకం చేపట్టారు. ఇలా మొక్కలను పెంచి తమ డ్రైవర్లకు, తమ సంస్థ ఉద్యోగులకు కాయగూరలు సరఫరా చేయవచ్చని కొన్ని సంస్థలు భావించాయి.