
ఈ రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రతి యేటా మార్చి 12 న దీని గురించి చెబుతుంటారు. ఈ రోజున కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి. అసలు ఏవేం తీసుకోవాలి అనే విషయాల గురించి ప్రతి చోటా అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటారు.

కిడ్నీలకు పనికొచ్చే ఆహారం తినాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు, పండ్లు తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. దీని వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే, కిడ్నీల కూడా బలంగా ఉంటాయి.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే కిడ్నీలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, ఉదయం లేవగానే వ్యాయామం చేయండి.

నీళ్లు : ఉదయం లేవగానే టీ , కాఫీ కంటే ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసులు మంచి నీళ్ళను తాగండి. ఇలా తాగితే కిడ్నీలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే, కిడ్నీల్లో ఉండే వ్యర్థాలన్ని బయటకు పంపిస్తాయి. అలాగే, రోజులో నాలుగు లీటర్ల నీళ్ళను తాగండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)