
వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో అండర్ వాటర్ సైక్లింగ్ ఔరా అనిపించింది. సముద్ర గర్భంలో స్కూబా డైవర్ల అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. విశాఖకు చెందిన నలుగురు స్కూబా డైవర్ల బృందం మంగమారి పేట ఋషికొండ మధ్య సముద్ర జలాల్లో ప్రదర్శన చేశారు.

ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు నేతృత్వంలో అండర్ వాటర్ సైక్లింగ్ నిర్వహించ్చారు. సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన రవాణా సాధనమంటున్నరు స్కూబా డైవర్లు. ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలన్న భారత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపును అందుకున్నారు.

వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్‌ఇన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు ఆధ్వర్యంలో సముద్ర జలాల్లో వినూత్న అండర్‌వాటర్ సైక్లింగ్ ప్రదర్శన నిర్వహించారు. బాలరాం నాయుడు నాయకత్వంలో నలుగురు స్కూబా డైవర్ల బృందం.. స్కూబా పరికరాలు ధరించి సముద్ర గర్భంలో సైక్లింగ్ చేశారు.

ఈ సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన రవాణా సాధనంగా ప్రోత్సహించారు. గతంలో అనేక బైసికిల్ క్లబ్‌లు చురుకుగా పనిచేసేవని, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలో వాటిని మరింత బలోపేతం చేసి యువతను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సైక్లింగ్ వల్ల ఇంధన పొదుపు జరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము అని అన్నారు బలరాం నాయుడు.