
నాటు కోడికి, ఫారం చికెన్ కు తేడా ఉంటుంది. నాటు కోడి మాంసం గట్టిగా ఉంటుంది ఉడకడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. దీనిని కూర వండే ముందే నీళ్ళలో ఉడకబెట్టి చేస్తారు. చాలా మంది నాటు కోడిని కోసేటప్పుడు పసుపు రాస్తారు? అసలు ఇలా ఎందుకు రాస్తారో కూడా తెలియదు. దీని వెనుకున్న కారణం ఏంటో చూద్దాం..

ఇప్పటికి పల్లెటూర్లలో నాటుకోడిని క్లీన్ చేసేటప్పుడు కానీ ఇంకా కాల్చే ముందు కచ్చితంగా పసుపు రాస్తారు. దీని వెనుక పాత కాలపు సంప్రదాయం ఉంది. అయితే, ఇలా రాయడానికి ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ నాటు కోళ్లు ఇళ్ళ దగ్గర పెరుగుతాయి. కాబట్టి, వీటిని కట్ చేసేటప్పుడు పసుపు రాస్తారు. దీనిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

ఈ కోడిపై ఉండే చెడు క్రిములు నశించడానికి రాస్తారు. ఇంకా కోడి చర్మానికి ఉండే సహజమైన వాసనను తగ్గించడానికి కూడా ఈ పసుపు హెల్ప్ అవుతుందని అంటున్నారు. అప్పుడు క్రిములు కూడా పోతాయి. ఈ పసుపుకు సహజంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి.

కోడిని కోసి క్లీన్ చేసే సమయంలో సూక్ష్మక్రిములు లేకుండా, మాంసం ఫ్రెష్ గా ఉండేందుకు ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా కాల్చేటప్పుడు కానీ ఉడికించేటప్పుడు కానీ ఈ పసుపు రాయడం వల్ల వాసన మారి, రుచి కూడా మెరుగవుతుందని పల్లె ప్రజలు నమ్ముతారు

కోడి చర్మం మీద అదే చిన్న క్రిములు కూడా పోతాయి. ఇంకా కూర కూడా రుచిగా ఉంటుంది. గ్రామాల్లో ఆచారంలా కొనసాగుతోంది. ఈ పసుపులో ఉండే కర్కుమిన్ శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే , పసుపు రాసినా, రాయకపోయినా కోడి మాంసాన్ని ఒకటికి మూడు సార్లు బాగా కడిగి పూర్తిగా ఉడికించి తింటే మంచిది.