
ఫిబ్రవరిలో వచ్చే వాలంటైన్స్ వీక్‌లో రోజ్‌డేను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజ్ డే అనేది కేవలం ప్రేమికులకే పరిమితం కాదు.. ఈ గులాబీని స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల తమ ప్రేమ, గౌరవం, ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఎర్ర గులాబీలను ఇస్తారు. అలానే మీరు మీ ప్రియమైనవారికి కూడా గులాబీలను ఇచ్చి మీ ప్రేమ, ఆప్యాయతను వ్యక్తపరవచ్చు.

ప్రేమ అండ్ పాషన్‌కు చిహ్నం: ఎరుపు గులాబీ అనేది లోతైన ప్రేమ, ఉద్వేగం, ఆకర్షణ, పాషన్‌ను సూచిస్తుంది. ఎరుపు రంగు అనేది చాలా డీప్‌గా, బలంగా కనిపిస్తుంది. అందుకే ప్రేమికులు చాలా మంది తన ప్రేమించిన వ్యక్తి పట్ల వారి ప్రేమ అంత బలంగా, లోతుగా ఉందని చెప్పడానికి గులాబిని ఇస్తారు.

పురాతన మిథాలజీ: గ్రీక్ పురానాల ప్రకారం..అఫ్రోడైట్ అనే ప్రేమ దేవత తన ప్రియుడైన అడోనిస్ తీవ్రంగా గాయపడి చనిపోయిన తర్వాత, ఆమె కన్నీళ్లు , రక్తం కలిసి ఎర్ర గులాబీలుగా మారాయనేది ప్రచారంలో ఉన్న కథ. అందుకే గులాబీని ప్రేమతో పాటు బాధకు కూడా చిహ్నంగా చూస్తారు.

విక్టోరియన్ యుగంలో 'ఫ్లోరియోగ్రఫీ: 18-19 శతాబ్దాల్లో యూరప్‌లో నివసించే చాలా మంది యువకులు తాము ఇష్టపడే వారిని ప్రేమిస్తున్నట్టు నేరుగా చెప్పేందుకు చాలా సిగ్గుగా భావించేవారట. ఈ క్రమంలోనే వారు ప్రేమించిన వారికి పూలు ఇచ్చి తమ భావాలు, ఇష్టాలను వ్యక్తపరిచేవారట. ఆ పువ్వులలో ముఖ్యంగా ఎవరైనా తమ ఇష్టమైన వారికి ఎర్ర గులాబి ఇస్తే " నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అని అర్థమట. అందుకే ప్రేమికుల రోజు నాడు చాలా మంది రోజ్ పువ్వును ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తారు.

ప్రస్తుత వాలైంటెన్స్ వీక్‌లో అనేది ఫిబ్రవరి 7ను రోజ్ డేతో మొదలవుతుంది. ఆ రోజు చాలా మంది రోజెస్‌ను కొనుగోలు చేసి.. తమ ఇష్టమైన, స్నేహితులు, లేదా ప్రేమికులుకు ఇచ్చి తమ ఇష్టాన్ని వ్యక్త పరుస్తారు. దీనిలో పాటు ఫిబ్రవరి 14 రోజున కూడా చాలా మంది ఎర్రగులాబీలతో తాము ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 ధృవీకరించట్లేదు)