
మందుబాబులు మద్యం తాగడానికి గాజు గ్లాసునే ఎందుకు ఉపయోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? స్టీలు గ్లాసులో ఎందుకు తాగరో తెలుసా..

గాజు గ్లాసులో మద్యం లేదా వైన్ సేవించడం వెనకా మనస్తత్వానికి సంబంధించిన మర్మమొకటి ఉందని నిపుణులు అంటున్నారు. గాజు గ్లాసులో మద్యం స్పష్టం కనిపిస్తుంది. దానిని చూస్తూ అనుభూతి చెందుతూ తాగుతారట. అదే స్టీలు గ్లాసులో ఐతే ఈ సదుపాయం ఉండదు.

మరొక కారణం ఏంటంటే.. గాజు గ్లాసులో మద్యం సేవించడం స్టేటస్‌కు గుర్తుగా భావిస్తారు. స్టీలు గ్లాసులో మద్యం సేవించడం తక్కువ స్టేటస్‌కు ప్రతీకగా చాలా మంది నమ్ముతున్నారు.

స్టీలు గ్లాసుల్లో మద్యం సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి.. మద్యం తయారు చేసే కంపెనీల్లో పెద్ద స్టీలు పాత్రల్లోనే దీనిని తయారు చేస్తారు. స్టీల్ బాటిళ్లు, క్యాన్లలో చాలా మంది బీర్లు తాగడం చూసేవుంటారు. ప్రయాణ సమయాల్లో చాలా మంది స్టీలు పాత్రల్లో మద్యాన్ని దాచుకుని తాగుతారు కూడా.

ఆల్కహాల్ సేవించడం చెడ్డ వ్యసనం అయినప్పటికీ ఒక్కసారి అలవాటైన తర్వాత అంత త్వరగా వదిలించుకోవడం చాలా కష్టం.

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)