
మన శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు దీర్ఘ కాలం మందులు వాడవల్సి ఉంటుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోతే, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కాలేయంలో పెరిగిన కొవ్వుతో బాధపడుతుంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కాలేయంలోని కొవ్వును సులభంగా తొలగించగల ఓ ప్రత్యేక పానీయం ఉంది.

జాస్మిన్ టీ కాలేయం నుంచి కొవ్వును తొలగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జాస్మిన్ టీలో అత్యధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి దీని టీ తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

కొన్ని రోజుల పాటు నిరంతరం జాస్మిన్ టీ తాగడం వల్ల కాలేయంలోని కొవ్వును కరిగించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే ఈ టీ తయారు చేయడం కూడా చాలా సులభం.

ఎండిన మల్లె రేకులతో జాస్మిన్ టీ తయారు చేసుకోవచ్చు. మల్లె పూల టీ తాగడం వల్ల కాలేయానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.