
గబ్బలాలు మిగతా పక్షులతో పోల్చుతే కాస్త వింతగా ఉంటాయి. ఇవి తలక్రిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి. ఒకే దగ్గర గుంపులుగా, చీకటి నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. అవి తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నప్పటికీ, వాటి రక్త ప్రసరణ సజావుగానే జరుగుతుంది. వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే క్షీరదాలలో, గబ్బిలాలు మాత్రమే ఎగరగలవు. అవి గాలిలో ఎగురుతున్నప్పుడు, అవి తమ పిల్లలను కడుపుపై మోసుకెళ్తాయి.

గబ్బిలాలు అన్ని ఇతర పక్షుల కంటే భిన్నంగా ఉంటాయి. అవి పక్షుల మాదిరిగా నేల నుండి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. అయినప్పటికీ, వాటికి లాకింగ్ స్నాయువులు ఉంటాయి. వీటి కారణంగానే అవి ఎలాంటి సపోర్ట్ లేకుండా తలక్రిందులుగా వేలాడగలుగుతాయి.

గబ్బిలాల రెక్కలు ఇతర పక్షుల రెక్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వీటి రెక్కలకు ఈకలు ఉండవు. అవి గొడుగులా విస్తరించి ఉన్న చర్మంతో నిర్మితమై ఉంటాయి. బొటనవేలు తప్ప మిగతా వేళ్లన్నీ గొడుగులుగా పనిచేస్తాయి. ఇది కేవలం ఒక్క బొటనవేలు సహాయంతోనే ఏ చెట్టు కొమ్మపైనా వేలాడగలదు.

గబ్బిలాలు ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి. పగటిపూట, అవి చెట్లు, గుహలు, పాడుబడిన భవనాలలో తలక్రిందులుగా వేలాడుతూ నిశ్శబ్దంగా ఉంటాయి. ఇవి ఎత్తులో ఉండడం వల్ల భూమిపై నివసించే ఏ ఇతర జీవులు వాటికి హాని కలిగించలేవు.

ఎగిరే సమయంలో గబ్బిలం నేలపై పడితే, అది మళ్ళీ ఎగరడం చాలా కష్టం. అందుకే అవి తలక్రిందులుగా వేలాడతూ ఉంటాయి. గబ్బిలాల శరీర నిర్మాణం కూడా అవి తలక్రిందులుగా వేలాడేందుకు అనుగుణంగా ఉంటుంది. వాటి మనుగడలో ఈ ప్రక్రియ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.