
నీళ్లు ప్రాథమికంగా పారదర్శకంగా ఉంటుంది. అంటే దానికి దాని స్వంత రంగు ఉండదు. అయితే స్విమ్మింగ్ పూల్ నీళ్లు మాత్రం నీలం రంగులో కనిపించడానికి కొన్ని శాస్త్రీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయి.

స్విమ్మింగ్ పూల్ నిర్మించేటప్పుడు నీలం, లేత ఆకుపచ్చ లేదా 'ఆక్వా' రంగు టైల్స్‌ను సాధారణంగా దాని అడుగు భాగం, ఇరు వైపులా ఉపయోగిస్తారు. స్విమ్మింగ్ పూల్ నీటితో నిండినప్పుడు ఈ టైల్స్ రంగు ముదురు రంగులోకి మారుతుంది. దీంతో మరింత స్పష్టంగా నీలం రంగులోకి మారి నీళ్లు కూడా అదే రంగులో కనిపిస్తాయి.

ఆకాశం నీలంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లు అద్దంలా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి బహిరంగ స్విమ్మింగ్ పూల్‌లో ఆకాశం ప్రతిబింబిస్తుంది. దీని వలన నీరు నీలం రంగులో కనిపిస్తుంది.

స్విమ్మింగ్ పూల్ నీటిని నిరంతరం ఫిల్టర్ చేస్తారు. దానికి క్లోరిన్ కలుపుతారు. నీళ్లు ఎంత శుభ్రంగా ఉంటే, కాంతి అంత బాగా వెళుతుంది. నీలం రంగు మరింత క్లియర్‌గా ఉంటుంది.

చాలా మంది నీలం రంగు నీటిలో కలపడం వల్ల అవి ఈ రంగులో కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నీటిలో రంగు ఉంటే, అందులో ఈత కొడుతున్న వ్యక్తులు కూడా బయటకు వచ్చినప్పుడు నీలం రంగులోకి మారేవారు. శుభ్రత, టైల్స్ కారణంగా మాత్రమే నీళ్లు నీలం రంగులో కనిపిస్తుంది.