
లివర్ సమస్యలు - కామెర్లు: కాలేయ సంబంధిత సమస్యలు లేదా పచ్చకామెర్లతో బాధపడేవారు పాలకు దూరంగా ఉండాలి. పాలలో ఉండే కొవ్వు, ప్రొటీన్లను అరిగించడం కాలేయానికి పెద్ద పని. ఇప్పటికే బలహీనంగా ఉన్న కాలేయంపై పాలు తాగడం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాలేయం త్వరగా కోలుకోకపోగా, కామెర్ల తీవ్రత మరింత పెరుగుతుంది.

లాక్టోజ్ ఇన్టోలరెన్స్ : కొందరి శరీరంలో పాలను జీర్ణం చేసే ఎంజైమ్‌లు సరిగ్గా ఉండవు. దీనినే లాక్టోజ్ ఇన్టోలరెన్స్ అంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగిన వెంటనే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, వాంతులు లేదా విరేచనాలు అవుతాయి. వీరు ఆవు పాలకు బదులుగా బాదం పాలు లేదా సోయా పాలు తాగడం మంచిది.

కడుపు ఉబ్బరం - అజీర్తి: తరచుగా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి పాలు సరిపడవు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మీగడ ఉన్న పాలు తాగితే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అలాగే తీవ్రమైన మొటిమలు, జిడ్డు చర్మం ఉన్నవారు పాలు ఎక్కువగా తాగితే.. పాల్లో ఉండే హార్మోన్ల వల్ల చర్మంలో జిడ్డు ఎక్కువై మొటిమలు మరింత పెరుగుతాయి.

ఫ్యాటీ లివర్: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారి కాలేయంలో ఇప్పటికే కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. వీరు పూర్తి కొవ్వు ఉన్న పాలు తాగితే కాలేయంలో కొవ్వు మరింత పెరిగిపోతుంది. ఒకవేళ పాలు తాగాలి అనుకుంటే వైద్యుల సలహా మేరకు కేవలం కొవ్వు లేని పాలు మాత్రమే స్వల్ప పరిమాణంలో తీసుకోవాలి.

పాలు మంచి పోషకాహారమే అయినప్పటికీ మీ శరీరంలో పైన పేర్కొన్న సమస్యలు ఏవైనా ఉంటే పాలు తాగే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అవసరమైతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీ శరీరానికి పాలు సరిపడతాయో లేదో తెలుసుకోవడం మంచిది.