
చైనాలో 90 శాతం మంది జనాలు అక్కడి సాంప్రదాయమైన బైజు చైనీస్ మద్యానే తాగుతారట.దీన్ని బైజు అనే ధాన్యాన్ని పులియబెట్టి తయారుచేస్తారు. దీన్ని చాలా బలమైనదిగా, ఆరోగ్యవంతమైనది పరిగణిస్తారు. దీనిలో 60 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు చైనాలో కూడా ట్రెండ్ మారింది.. అక్కడి జనాలు కూడా సాంప్రదాయ మద్యాన్ని విడిచి.. విదేశీ మద్యానికి అలవాటు పడుతున్నారట.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం చైనాలో కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. అక్కడి యూత్ సాంప్రదాయ మద్యానికి బదులు అంతర్జాతీయ పానీయాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో నివసించే యువత, విద్యావంతులైన, మధ్యతరగతి ప్రజలు విస్కీని స్టైలిష్ పానీయంగా భావిస్తారు. దీంతో ప్రస్తుతం చైనాలో వీటికి డిమాండ్ పెరిగింది. గత నాలుగేళ్లలో చైనాలో విస్కీ మార్కెట్‌లో సుమారు $2.3 బిలియన్లకు చేరుకుంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా.

చైనాలో సోషల్ మీడియా, మారుతున్న జీవనశైలులు కూడా ఈ ధోరణికి ఆజ్యం పోస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా యాప్‌లలో, ప్రజలు విదేశీ మద్యాన్ని ఒక విలాసవంతమైన జీవనశైలితో చూపించడంతో యువత దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో విస్కీని కేవలం రుచి కోసమే కాకుండా, ఒక హోదా చిహ్నంగా కూడా కొనుగోలు చేస్తున్నారు.

పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు కంపెనీలు ఇప్పుడు చైనాలో విస్కీని ఉత్పత్తిని పెంచుతోంది. ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్, బ్రిటిష్ కంపెనీ డియాజియో వంటి ప్రధాన సంస్థలు చైనాలో కొత్త ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాయి. భవిష్యత్తులో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ మార్కెట్‌గా మారగలదని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం, చైనాలోని మొత్తం స్పిరిట్స్ మార్కెట్‌లో విస్కీ వాటా 2శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని పెంచాలని ఆయా కంపెనీలు బావిస్తున్నాయి.

అయితే, విస్కీకి పెరిగిన డిమాండ్‌తో సాంప్రదాయ మద్యమైన బైజియు క్రేజ్ తగ్గుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం బైజియుకు ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గదని తేల్చి చెప్పారు. ఇది చైనీస్ సంస్కృతి, సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. నేటికీ, పండుగలు, కుటుంబ సమావేశాల సమయంలో లక్షలాది మంది దీనిని ఆస్వాదిస్తున్నారు. ఎన్ని విదేశీ బ్రాండ్‌లు వచ్చినా.. సాంప్రదాయ బ్రాండ్ అయిన జైజియూ మాత్రం తన స్థాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతున్నారు.